కడప: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని పులివెందుల డీఎస్పి మురళి నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో పోలీసుల కళాజాత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. ఫ్యాక్షన్ విడనాడాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పోలీస్ కళాకారుల బృందం పాటలు, నాటికల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు.