UK ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్ గేట్ వద్ద ఓ వ్యక్తి కారుతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనపై అధికారులు పలు రకాలుగా వివరాలను ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఐసీయూలో చేర్చిన ఒక రోజు తర్వాత, వైద్య కారణాలతో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్వాసకోశ సమస్యల కారణంగా జైన్‌ను ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిలో చేర్చారు.
ఆగ్రహం కట్టలు తెంచుకున్న కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరాభవం ఎదురవడంతో సోదాలు చేయకుండానే వారు వెనుదిరిగారు. కాగా ఈ దాడిని ఐటీ శాఖ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ(lakshmamma) ఆరోగ్యం గురించి తాజాగా హెల్త్ బులెటిన్ ను కర్నూలు విశ్వభారతి వైద్యులు రిలీజ్ చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని, డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ 8 మందిని అరెస్ట్ చేసిన SOT పోలీసులు పావనీ బ్రాండ్ పేరుతో నకిలీ విత్తనాల విక్రయం బాలానగర్, రాజేందర్ నగర్ ప్రాంతాల్లో సోదాల్లో లభ్యం వ్యవసాయ శాఖతో కలిసి పోలీసుల స్పెషల్ ఆపరేషన్ 85 లక్షల నకిలీ విత్తనాలు సీజ్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
ది ఫిగెన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో, కొమ్ములతో కూడిన గంభీరమైన జింక ముందు చిన్న అమ్మాయి(little girl) గౌరవంగా నమస్కరిస్తున్నట్లు చూపిస్తుంది. జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించి నమస్కరిస్తుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓసారి లుక్కేయండి మరి.
నేడు అమరావతిలోని వెంకటాయపాలెంలో సీఎం వైయస్ జగన్(cm jagan) చేతుల మీదుగా 51,392 వేల మంది నిరుపేద కుటుంబాలు పట్టాలు అందుకోనున్నారు.
యంగ్ నటీనటులు యాక్ట్ చేసిన ‘మేమ్ ఫేమస్’ మూవీ ఈరోజు(మే 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలను ట్విట్టర్లో తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
పూనం ఆర్ట్ అకాడమీ ద్వారా Instagramలో భాగస్వామ్యం చేయబడిన ఓ వీడియోలో ఇద్దరు మహిళలు వృత్తం గీస్తున్నట్లు చూపబడింది. అనుకోని విధంగా అది 3డీ ఆర్ట్ అయిపోయింది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ మునుపెన్నడూ లేని సరికొత్త ఫీచర్లతో భారత్ లో త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం మొబైల్ ఫీచర్లు స్మార్ట్ ఫోన్ ప్రేమికులను అలరిస్తున్నాయి. OnePlus 11 5G యొక్క కొత్త మార్బుల్ ఒడిస్సీ వేరియంట్ ధర భారతదేశంలో రూ.64,999.
కర్ణాటక ఫలితాలే తెలంగాణలోను వస్తాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
యూజర్ల భద్రత, గోప్యతను మెరుగుపరిచే చర్యలలో భాగంగా ఓ ప్రమాదకర యాప్ ను గుర్తించి గూగుల్ దాన్ని ప్లే స్టోర్ (Play Store)నుంచి తొలగించింది.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బ్రేక్ పడింది
హైదరాబాద్లో ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలిసారి జనరల్ రూట్ పాస్‌లు ప్రవేశపెట్టింది.
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అసోం భామ రూపాలీని మనువాడారు.