»Only I Have The Power To Buy The Visakha Steel Plant Ka Paul
Narsipatnam : విశాఖ స్టీల్ ప్లాంట్ కొనే సత్తా నా ఒక్కడికే ఉంది – కేఏ పాల్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తనకు మాత్రమే ఉందన్నారు. అన్ని పార్టీలు కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేద్దామని పిలుపునిచ్చారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) కొనే స్థోమత తన ఒక్కడికే ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు.విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు కోసం తాను రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. చంద్రబాబు(Chandrababu), జగన్ లు ఇద్దరూ సీఎంలుగా ఫెయిలయ్యారన్నారు. తనను సీఎం చేస్తే రాజధాని అమరావతిని పూర్తి చేస్తానన్నారు. సింగరేణిని కాపాడుకోలేని సీఎం కేసీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా కొనగలరని? ప్రశ్నించారు. రూ.45 వేల కోట్ల విదేశీ నిధులు తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని కేఏ పాల్ చెప్పారు. నర్సీపట్నం(Narsipatnam)లో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన కేఏ పాల్… మార్గమధ్యలో మీడియాతో మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటిసారిగా తానే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశానని పాల్ గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం, ఆఖరికి స్టీల్ ప్లాంటు పోరాట సంఘాలు రాకపోయినా పోరాడానని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రధాని మోదీ (PM MODI), అమిత్ షాని, ఉక్కు శాఖ మంత్రిని పదీ పదిహేను సార్లు కలిశానని వెల్లడించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయొద్దని కోరానని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ లేఖ రాశారని, ఆ లేఖలు కుక్కలైనా పట్టించుకుంటాయా అని ఎద్దేవా చేశారు. ‘‘పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిరాహార దీక్ష చేశాడట. స్టీల్ ప్లాంట్ దగ్గర నేను టెన్త్, ఇంటర్ పరీక్షల కోసం నేను నిరాహార దీక్ష చేశాను. ప్రభుత్వం, చంద్రబాబు పట్టించుకున్నారా? కేసులకు భయపడి వారు ముందుకే రాలేదు’’ అని వ్యాఖ్యానించారు. రూ.42 వేల కోట్లు డొనేషన్ ఇస్తానని రాతపూర్వకంగా నేను హామీ ఇచ్చాను. మోదీ, అమిత్ షాని, స్టీల్ మినిస్టర్ ని కలిసి ప్రైవేటీకరణ చేయొద్దని కోరాని కేఏపాల్ అన్నారు.