సీనియర్ నటి లక్ష్మీ(Lakshmi) కూతురు ఐశ్వర్య భాస్కరన్(Actress Iswarya Bhaskaran) దయనీయ స్థితిలో ఉంది. సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో ఆమెకు అవకాశాలు లేక సబ్బులు(Soaps) అమ్ముకుంటున్నట్లు ఆమె స్వయంగా తెలిపింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య భాస్కరన్ అనేక తెలుగు చిత్రాల్లో నటించింది. అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి. నాని, కళ్యాణ వైభోగం వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఐశ్వర్య భాస్కరన్(Actress Iswarya Bhaskaran) తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తోంది. ఆ ఛానెల్లో ఆమె వెగాన్ వంటలు, సబ్బుల తయారీ, ఆధ్యాత్మిక అంశాల గురించి చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమెకు ఆన్ లైన్లో లైంగిక వేధింపులు ఎక్కువైన సంగతి తెలిపింది.
కొంత మంది తన ఫోన్కు అనుచిత సందేశాలు, అసభ్యకర ఫోటోలు పంపుతున్నారని ఐశ్వర్య భాస్కరన్(Actress Iswarya Bhaskaran) ఆవేదన వ్యక్తం చేసింది. కొందరైతే ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలను ఆమెకు షేర్ చేస్తున్నట్లు తెలిపింది. వాటివల్ల తాను మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లు ఎమోషనల్ అయ్యింది. గతంలో తన సబ్బుల బిజినెస్(Soap Business) కోసం తన కాంటాక్ట్ నెంబర్ ను చాలా మందికి షేర్ చేశానని, అందుకే తనకు వేధింపులు మొదలైనట్లు వివరించింది. తనను ఇబ్బంది పెట్టే అటువంటి మెస్సేజులు పంపుతూ ఎవరైనా వేధిస్తుంటే సహించబోనని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.