»The Government Entrusted The New Security To The New Secretariat
Telangana : నూతన సెక్రటేరియట్ కు కొత్త భద్రతను అప్పగించిన ప్రభుత్వం
సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్ఎస్పీ (TSSP) చేతికి అప్పగించారు. 350 మందికి పైగా టీఎస్ఎస్పీ సిబ్బందితోపాటు దాదాపు 300 మంది సాయుధ రిజర్వు పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ (Telangana) సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త సెక్రటేరియట్ భద్రతను టీఎస్ఎస్పీ(TSSP)కి అప్పగిస్తూ ఊత్తర్వులు జారీ చేసింది. గత 25 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రముఖుల భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, కొత్త సెక్రటేరియట్ (Secretariat) భద్రతను చూస్తున్న ఎస్పీఎఫ్ (SPF) ను పక్కకు పెట్టింది . దీనికి ఎలాంటి కారణాలను తెలపలేదు ప్రభుత్వం. ఎస్ పీఎఫ్ కు బదులుగా సెక్రటేరియట్, ప్రభుత్వ ఆస్తుల భద్రతను టీఎస్ఎస్ పీ(TSSP)కి అప్పజెప్పింది. బందోబస్తు, వీఐపీ సెక్యూరిటీ, కూంబింగ్ లలో టీఎస్ ఎస్పీ సేవలు అందించనుంది. టీఎస్ఎస్ పీ కి ఫుల్ టైమ్ వెపన్ ట్రైనింగ్ ఇచ్చింది ప్రభుత్వం. 1998లో స్పెషల్ జీఓతో సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ ప్రొటక్షన్ ను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో 1650 మంది ఎస్పీఎఫ్ (SPF) సిబ్బంది ఉండేవారు.గతంలో సెక్రటేరియట్ లో 150 మంది ఎస్ పీఎఫ్ సిబ్బంది సేవలు అందించారు. ప్రధాన ఆలయాలు, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఎస్పీ ఎఫ్ బందోబస్తు నిర్వహించే వారు. వాహనాల తనిఖీ, అబ్జర్వేషన్, వ్యక్తులపై మానిటరింగ్ టెక్నిక్స్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 1991 లో SPF ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాలుగా సెక్రటేరియట్ లో ఎస్పీ ఎఫ్ సెక్రటేరియట్ లో సేవలందిస్తోంది. ప్రస్తుతం ఎస్పీ ఎఫ్ డీజీగా ఉమేష్ షరాఫ్ ఉన్నారు. అయితే 25 ఏళ్లుగా ఉన్న ఎస్పీఎఫ్ కు బదులు టీఎస్ఎస్ పీ కు సెక్రటేరియట్ భద్రతను అప్పగించడమేంటని చర్చనీయాంశంగా మారింది. మూడు కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీసులు, 300 మంది నగర పోలీసులు ( police) సచివాలయ భవన భద్రతను చూసుకుంటారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసు(Traffic Police)ల నుంచి 22 మంది సిబ్బందిని కేటాయించారు.
బ్యాగేజీ స్కానర్లు(Baggage scanners), వాహన స్కానర్లు, బాడీ స్కానర్లు వంటి భద్రతా పరికరాలను వినియోగించనున్నారు.సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మొత్తం 300 సీసీటీవీ కెమెరాల(CCTV camera)ను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం(Control room)ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా సందర్శకుల పర్యవేక్షణ జరుగుతుంది. సచివాలయ భవనంలో ఫైర్ సేఫ్టీ(Fire safety) ఏర్పాట్లతో పాటు 34 మంది సిబ్బందితో రెండు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరో అంతస్తు మినహా అన్ని అంతస్తుల్లో సందర్శకులను అనుమతిస్తారు.