టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ నుంచి నిధులు తీసుకున్నానన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy)పై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని ఆత్మసాక్షిగానే చెప్పానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(MLA Etala Rajender) అన్నారు. ప్రజల కోసం, ధర్మం కోసమే తాను మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. తాను ఎవరినీ కించపరిచే వ్యక్తిని కాదని తెలిపారు.మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ (CM KCR) నుండి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు వచ్చాయని ఈటల రాజేందర్ ఇటీవల ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తమకు అధికార పార్టీ నుండి ఏ డబ్బులూ ముట్టలేదని, అలా అని తాను భాగ్యలక్ష్మి దేవాలయం (Bhagyalakshmi Temple) వద్ద ప్రమాణ స్వీకారం చేస్తానని సవాల్ చేశారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ ఆలయానికి వచ్చిన రేవంత్ తమకు డబ్బు ముట్టలేదంటూ ప్రమాణం చేశారు.రేవంత్ ప్రమాణంపై ఈటల స్పందించారు.
తాను సింగరేణి అంశంపై పెట్టిన ప్రెస్ మీట్ సమయంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. గుడికి వెళ్లి అమ్మతోడు… అయ్యతోడు అనడం ఏమిటన్నారు. తాను కూడా ఆత్మసాక్షిగా చెబుతున్నానని అన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. తనను సవాల్ చేసిన వారు ఏం మాట్లాడతారో చూశాక.. అన్నింటి పైన స్పందిస్తానని చెప్పారు. అవసరమైతే రేపు మాట్లాడుతానని అన్నారు. తుది శ్వాస వరకు కేసీఆర్ తో రాజీపడే ప్రసక్తే లేదు. చర్లపల్లి జైల్లో(Charlapally Jail) కేసీఆర్ నన్ను నిర్బంధించినా భయపడలేదు. కేసీఆర్ సర్వం దారబోసినా నన్ను కొనలేరు. ప్రశ్నించే గొంతుపై నిందలు వేస్తే కేసీఆర్ కు మద్దతు ఇచ్చినట్లే.
కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడదామంటే ఇదేనా ఈటల రాజేందర్? కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై నేనే పోరాటం చేశాను. నా కళ్లలో నీళ్లు తెప్పించావు” అని రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు .తెలంగాణ (Telangana) కోసం కొట్లాడుతుంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? అని నిలదీశారు. వందల కేసులు పెట్టినా భయపడ లేదని అన్నారు. “మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా నిర్ణయించాం. ఒక్క రూపాయి పంచకపోయినప్పటికీ పాల్వాయి స్రవంతి (Palvai Sravathi) ని 25 వేల ఓట్లు వచ్చాయి. కేసీఆర్ తో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు. మునుగోలులో బీజేపీ (Bjp) , బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. మునుగోడులో రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి” అని రేవంత్ రెడ్డి అన్నారు.