»Another Prestigious International Invitation To Minister Ktr
Dubai : మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.
తెలంగాణ (Telangana) ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది.దుబాయ్(Dubai)లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ (The world is artificial) ఇంటెలిజెన్స్ షోకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కేటీఆర్‌ను నిర్వహకులు ఆహ్వానించారు. జూన్7, 8వ తేదీల్లో జరిగే ఈ ప్రదర్శన జుమేరా ఎమిరేట్స్ టవర్, దుబాయ్‌లో జరుగనుంది. మంత్రి కేటీఆర్(Minister KTR) సారధ్యంలో తెలంగాణ అద్భుతమైన పురోగతిని సాధించిందని ఐటీ అనుబంధ రంగాల్లో విజయం సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు తెలిపారు. దుబాయిలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు (Health sector), రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొనున్నారు.
దుబాయ్‌కి అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించడంతోపాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం(The field of intelligence)లో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు. మంత్రి కేటీఆర్ హాజరు కావడం ద్వారా దుబాయ్‌లో ఉన్న భారతదేశ, ముఖ్యంగా తెలుగు ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని వారు వెల్లడించారు. తెలంగాణ అనుభవాల నుంచి విదేశాలతో పాటు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ రీజియన్ (African Region) వంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతినిధులు స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 41వ గ్లోబల్ ఎడిషన్ (Global Edition) ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.