Raghurama write letter to pm modi on chandrababu life threaten
Raghurama krishna raju:ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై (chandrababu) జరిగిన రాళ్ల దాడి ఇష్యూ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ నేతలు గవర్నర్‌కు (governer), కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama krishna raju) స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (modi) లేఖ రాశారు.
ఏపీలో రాజకీయం హద్దు మీరుతోందని.. ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని రఘురామ గుర్తుచేశారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు (chandrababu) ర్యాలీ తీసిన సమయంలో రాళ్లదాడి అంశాన్ని లేఖలో రఘురామ (Raghu rama) ప్రస్తావించారు. ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి చంద్రబాబుకు (chandrababu) రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమయంలో ఓ కమాండెంట్ సంతోష్‌కు గాయాలు అయ్యాయని వివరించారు.
ఇక్కడికి వస్తే అడ్డుకుంటామని మంత్రి సురేష్ (suresh) ముందే రెచ్చగొట్టేలా ప్రకటన చేశారని వివరించారు. ముందే చొక్కా చించుకొని.. వీధి పోరాటం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబుపై (chandrababu) జరిగిన దాడిని ఖండించాలని రఘు రామ (Raghu rama) కోరారు. దాడిని నిరసిస్తూ ట్విట్టర్ రచ్చబండ కార్యక్రమానికి నల్లచొక్కా ధరించి రఘురామ (Raghu rama) వచ్చారు. గత నాలుగేళ్లుగా ఏపీలో ప్రతీ రోజు చీకటిరోజుగా తయారయ్యిందని తెలిపారు.
రాక్షసులను అంతం చేసేందుకు విష్ణు (vishnu), శివుడు (shiva) చాలాసార్లు కలిశారని గుర్తుచేశారు. ఏపీలో బ్రహ్మ, విష్ణువు, శివుడు కలుస్తారా.. లేదంటే విష్ణు, శివుడు కలుస్తారా చూడాలని అన్నారు. బాబును విష్ణువుగా, పవన్‌ను శివుడిగా.. బ్రహ్మగా బీజేపీని భావిస్తున్నానని పేర్కొన్నారు. తన అంచనా ప్రకారం ఈ ముగ్గురు కలవాల్సి ఉందని చెప్పారు.