»Superstar Rajanikanth Emotional On Meena Daughter Nainika Speech
Meena కూతురు నైనికా స్పీచ్‌పై రజనీకాంత్ కంటతడి
నటి మీనా కూతురు నైనిక మాటలు రజనీకాంత్ కంటతడి పెట్టించాయి. నటి మీనా ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైనిక వీడియో ప్లే చేశారు.
Superstar Rajanikanth emotional on Meena Daughter Nainika Speech
Meena Daughter Nainika:ప్రముఖ నటి మీనా (Meena) కూతురు నైనిక ( Nainika) స్పీచ్ పలువురిని కంటతడి పెట్టించింది. మీనా (Meena) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 40 ఏళ్లు అయిన సందర్భంగా చెన్నైలో (chennai) కార్యక్రమం నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. రజనీకాంత్ (rajanikanth), బోనీకపూర్ (boneykapoor), రాధిక (Radhika), రోజా (Roja), సంఘవి (sanghavi), స్నేహా (sneha), ప్రభుదేవా (prabudeva) ప్రముఖులు హాజరయ్యారు.
కార్యక్రమంలో మీనా కూతురు నైనిక మాట్లాడిన వీడియోను (video) ప్లే చేశారు. అమ్మ.. ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం గురించి తెలుసు.. ఇందుకు తాను చాలా గర్వపడుతున్నాను. నటిగా కష్టపడుతూనే ఉంటావు. నటిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మా గురించి ఆలోచించేదానివి అంటూ కంటిన్యూ చేసింది.
ఓ సారి షాపింగ్ మాల్‌కు వెళ్లగా.. చాక్లెట్ తింటూ కూర్చొన్నానని గుర్తుచేసింది. కొద్దీసేపు కనిపించకుంటే పడ్డ కంగారు గురించి తనకు తెలుసు అని చెప్పారు. ఆ సమయంలో తిట్టావు.. అరిచావు.. ఆ రోజు పడిన కంగారు.. తనకు ఇప్పుడు అర్థమయ్యిందని అన్నారు. ఆ రోజు ఇబ్బంది పెట్టినందుకు క్షమించు అమ్మా.. ఇకపై జాగ్రత్తగా చూసుకుంటాను అని తెలిపింది.
మీనా (meena) గురించి వస్తోన్న పుకార్ల గురించి కూడా నైనిక (nainika) మాట్లాడారు. అమ్మ నటిగానే కాదు ఓ మనిషి అని గుర్తించాలని నైనిక రిక్వెస్ట్ చేసింది. దయచేసి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు అని కోరింది. నైనిక వీడియో ప్లే అయిన సందర్భంలో అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. రజనీకాంత్‌కు అయితే కళ్ల నుంచి నీరు వచ్చింది. అందరీ కళ్లలో నీరు తిరిగాయి. మీనా భర్త అనారోగ్యంతో చనిపోవడంతో రెండో పెళ్లిపై చర్చ వచ్చింది. నటుడు సుదీప్తో రెండో పెళ్లి అని రూమర్స్ వచ్చాయి. అందుకోసమే నైనిక ప్రత్యేకంగా మాట్లాడారు.