»Ys Viveka Murder Bahind Land Settlementdastagiri 1st Statement
YS Viveka murder:బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంటే వివేకా హత్యకు కారణం: దస్తగిరి
బెంగళూర్ భూ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బుల విషయంలో వివేకా, ఎర్ర గంగిరెడ్డి మధ్య తేడా వచ్చిందని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.
YS Viveka murder bahind land settlement:Dastagiri 1st statement
YS Viveka murder, land settlement, bengalure, Dastagiri, Avinash
Dastagiri:వైఎస్ వివేకా (viveka) హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. వివేకా రెండో భార్య గురించి తెరపైకి రావడం.. సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. హత్య (murder) కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి (dastagiri).. అవినాష్, భాస్కర్ రెడ్డి గురించి ఘాటుగా ఆరోపణలు చేశారు. అప్రూవర్‌గా మారకముందు దస్తగిరి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ వెలుగులోకి వచ్చింది. కస్టడీలో ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి పొంతనే లేదు. వివేకా హత్యకు కారణం బెంగళూరులో సెటిల్ మెంట్ అని దస్తగిరి (dastagiri) చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివేకాతో (viveka) 2016 నుంచి పరిచయం ఉందని దస్తగిరి (dastagiri) తెలిపాడు. 2017 ఫిబ్రవరి నుంచి 2018 డిసెంబర్ వరకు డ్రైవర్‌గా పనిచేశానని వివరించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో వివేకా (viveka) తీరులో తేడా కనిపించిందని పేర్కొన్నాడు. తనను దారుణంగా దూషించాడని వివరించాడు.
కడపకు చెందిన రాధా కృష్ణమూర్తి, అతని కుమారుడు ప్రసాదమూర్తి భూ వివాదానికి సంబంధించి సెటిల్ మెంట్ గురించి 2017 నుంచి 2018 వరకు బెంగళూర్ తిరిగామని దస్తగిరి (dastagiri) తెలిపాడు. సెటిల్ మెంట్ తర్వాత వివేకాకు రూ.8 కోట్లు వస్తాయని తనకు తెలిసిందన్నాడు. 2018లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి బెంగళూర్ వెళ్లారని తన స్టేట్మెంట్లో దస్తగిరి తెలిపాడు.
భూ వివాదంలో వచ్చిన రూ.8 కోట్లలో 50 శాతం వాటా ఇవ్వాలని ఎర్ర గంగిరెడ్డి వివేకాను అడిగారని చెప్పాడు. తననే వాటా అడిగేంత పెద్దొడివి అయిపోయావా అని గంగిరెడ్డిని వివేకా అన్నారట. ఆ రోజు నుంచి వారి మధ్య మాటలు లేవని పేర్కొన్నాడు. 2019 ఫిబ్రవరిలో గంగిరెడ్డి పిలువడంతో పులివెందుల వెళ్లి కలిసానని దస్తగిరి చెప్పాడు. వివేకా హత్య గురించి చెప్పగా.. తాను ముందు ఒప్పుకోలేదని వివరించాడు.
లైఫ్ సెటిల్ అయ్యేంత పెద్ద మొత్తం ఇస్తామని చెప్పడం.. పెద్ద వాళ్లు ఉన్నారని చెప్పడంతో ఒప్పుకున్నానని వివరించాడు. ఇలా వివేకా హత్య జరిగి ఉంటుంది. ఇప్పుడు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. దస్తగిరి మొత్తం 3 స్టేట్ మెంట్లు ఇచ్చాడని అవినాష్ పేర్కొన్నారు. రెండో స్టేట్ మెంట్ ఆధారంగానే సీబీఐ దర్యాప్తు చేస్తుందని అవినాష్ అంటున్నారు. ఫస్ట్ స్టేట్ మెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాలని అవినాష్ కోరుతున్నారు.