MBNR: పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండలంలో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయి. మండలంలోని కాకరజాల, పల్లె గడ్డ, పుట్టోని పల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు. గండీడ్ మండలంలో అంచన్పల్లి, మన్సూర్ పల్లి, మహమ్మదాబాద్ మండలంలోని ఆముదాల గడ్డ, రాజాపూర్ మండలంలోని మోత్కులకుంట తండా ఏకగ్రీవమైనట్లు తెలిపారు.