Hyderabad Woman Dies: ఐటీ హబ్ బెంగళూరులో యువతి (women) దారుణ హత్యకు గురయ్యింది. ఆ యువతి పేరు ఆకాంక్ష (akanksha) కాగా.. స్వస్థలం హైదరాబాద్ (hyderabad) అని తెలిసింది. ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తే హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య చేశాడని భావిస్తోన్న అర్పిత్ (arpit) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలను చేపట్టారు.
ఆకాంక్ష (akanksha) స్వస్థలం హైదరాబాద్ కాగా.. అర్పిత్ ఢిల్లీకి (delhi) చెందినవాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లో సహజీవనం (live-in-relationship) చేశారట. ఆకాంక్షకు (akanksha) వేరే జాబ్ రావడంతో బెంగళూర్ (bengalure) షిప్ట్ అయ్యింది. జీవన్ భీమా నగర్లో గల ఓ అపార్ట్మెంట్లో ఉంటుంది. ఆమెను కలిసేందుకు అర్పిత్ (arpit) కూడా వచ్చేవాడట. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు తెలిపారు.
సోమవారం (monday) రోజున కూడా అర్పిత్ (arpit) ఆకాంక్షను మీట్ అయ్యేందుకు వచ్చాడట. ఇద్దరి మధ్య గొడవ జరిగిందని సమాచారం. కోపంలో ఆకాంక్షను (akanksha) అర్పిత్ హత్య చేసి ఉంటాడని కాప్స్ సస్పెక్ట్ చేస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అదీ విఫలం కావడంతో నేలపై వదిలేసి ఇంటి తలుపులు వేసి వెళ్లిపోయాడు.
ఆకాంక్ష (akanksha) రూమ్ మేట్ అపార్ట్‌మెంట్‌కు రావడంతో ఆమె విగతజీవిగా పడి ఉంది. వెంటనే చుట్టుపక్కన వారికి తెలుపగా.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అర్పిత్ ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఏ విషయంలో గొడవ జరిగిందో తెలియదు కానీ.. ఆకాంక్షది (akanksha) హత్యేనని పోలీసులు చెబుతున్నారు.