»Third Vande Bharat Train To Telangana Secunderabad To Nagpur Schedule Soon
Telangana:కు మూడో వందేభారత్ రైలు..త్వరలో షెడ్యూల్
తెలంగాణ(telangana) వాసులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్(Vande Bharat train) రాబోతుంది. ఇప్పటికే ఓ ట్రైన్ తెలంగాణకు మరోకటి ఏపీకి మంజూరు కాగా..ఇప్పుడు మూడోది వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఖరారు కాగా ఇటీవల ట్రైలర్ కూడా నిర్వహించారు.
సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(Vande Bharat train) అతి త్వరలోనే తెలంగాణ(telangana)కు వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో అధికారులు ట్రైరల్ రన్ కూడా నిర్వహించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం గంటకు 130 కిమీ. ప్రస్తుతం సికింద్రాబాద్, తిరుపతి.. విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతోపాటు వారం పొడవునా 100 శాతం ఆక్యుపెన్సీ రేటుతో నడుస్తాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు తెలిసింది. భారతీయ రైల్వే SCR అధికారులతో కలిసి ఈ సేవలను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్, నాగ్‌పూర్(secunderabad to nagpur) మధ్య ఇప్పటికే దాదాపు 25 రైళ్లు నడుస్తున్నాయి. రెండు నగరాలు వాణిజ్య, వ్యాపార కేంద్రాలు. అయితే అన్నీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూపర్‌ఫాస్ట్ రైళ్లు కాదు. రెండు నగరాల మధ్య చాలా వాణిజ్యం జరుగుతుంది. సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య దూరం దాదాపు 581 కి.మీ. సాధారణంగా దూరాన్ని అధిగమించడానికి 10 గంటలు పడుతుంది. ఇప్పుడు భారతీయ రైల్వే కొత్త వందే భారత్ రైలును ప్రవేశపెట్టడం ద్వారా సమయాన్ని 10 గంటల నుంచి 6.30 గంటలకు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఈ వందే భారత్ రైలు మార్గాన్ని కూడా రైల్వే అధికారులు ఖరారు చేసినట్లు సమాచారం.
అయితే ఈ ట్రైన్ తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కాజీపేట, రామగుండం, సిర్పూర్ ఖగజ్ నగర్, బలార్షా మీదుగా నడపాలని భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఈ రైలుకు పెద్దపల్లి(peddapalli) జంక్షన్లో స్టాప్ లేకపోవడం పట్ల పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.