VKB: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుతో పంచాయతీలకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని గత ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా కంపోస్టు షెడ్లను నిర్మించింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా తయారుచేసి పంచాయతీలు ఆదాయం పొందాలనేది వీటి ఉద్దేశ్యం. కానీ, కులకచర్ల మండలంలో వీటి వినియోగంలో ఉన్నట్లు కన్పించడంలేదు. దీంతో లక్షలు పోశారు.. ఏం లాభం..? అని పలువురు అంటున్నారు.