PLD: క్రోసూరు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) జరుగుతుందని తహశీల్దార్ నాగరాజు తెలిపారు. మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు హాజరవుతారని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని మండల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలన్నారు.