BHPL: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం సమావేశం జరగనుందని జిల్లా నాయకులు తెలిపారు. ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం ముఖ్య అతిథిగా హాజరవుతారు. నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించి డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జిల్లా నుంచి 11 మంది నాయకులు దరఖాస్తు చేయగా, పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.