NGKL: రాత్రి కురిసిన భారీ వర్షానికి చారకొండ మండలంలోని ఎర్రవల్లి వాగు, గోకారం వాగు, చంద్రయాన్ పల్లి వాగులు ఉప్పొంగడం వల్ల రోడ్లు దెబ్బతిని మూడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్నారు. ఎర్రవల్లి తండా వాసులు ఎటు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.