WGL: నర్సంపేటలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో AIFDW నాయకురాలు రాగసుధ మాట్లాడుతూ.. ఆసుపత్రుల పరిపాలన బాధ్యతలు నాన్ మెడికల్ అధికారులకు ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, మెడికల్ అధికారుల చేతుల్లోనే ఆసుపత్రుల నిర్వహణ ఉండేలా జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.