ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో, వినోద్ అనంతోజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ ద్వారా నేరుగా విడుదల కానుంది. ఈ చిత్రానికి నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియాలో తాజాగా విడుదల చేశారు.