NGKL: ప్రతి గ్రామానికి సమగ్ర సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పంచాయతీ భవనం గ్రామ ప్రజల సేవా కేంద్రంగా మారాలన్నారు. గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని పేర్కొన్నారు.