ASR: దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని ఈగిల్ టీమ్ సీఐ నారాయణరావు, కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మంప ఎస్సై శంకరరావుతో కలిసి కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల-2లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.