W.G: భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి PMVBRY పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ ఘర్ యోజన పథకాన్ని భారత ప్రధాని 1 ఆగస్టు 2025న ప్రారంభించారన్నారు. రెండు సంవత్సరాలలో యువతకు 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు.