GNTR: తన భర్త కత్తితో తన గొంతు కోయడానికి ప్రయత్నించాడని భార్య మంగళవారం గుంటూరులోని అరండల్ పేట స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శ్రీనగర్‌కి చెందిన పద్మ, సర్వేశ్వరరావు దంపతులకు 25 సం.ల క్రితం వివాహమైంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న తన భర్త ప్రతీరోజూ మద్యం తాగివచ్చి కొడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.