సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి సందర్భంగా నవంబర్ 13 నుంచి 24 వరకు ఉచిత అన్నప్రసాద సేవలు ఏర్పాటు చేస్తున్నారు. సాయి సన్నిధికి వచ్చే లక్షలాది భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ-కాఫీ, రాత్రికి చపాతీ భోజనం అందించనున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్సవాలకు సుమారు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.