NZB: బోధన్ పట్టణంలో ప్రధాన రహదారిలోని మున్సిపల్ డివైడర్ల మధ్య కొన్ని వ్యాపార,ప్రైవేటు ఆసుపత్రుల ప్రకటన బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోందని ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతోనే ఈ విధంగా ప్రకటన బోర్డులు వెలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.