GNTR: సంక్షేమ హాస్టల్స్ అన్నీ కష్టాలతో విలవిల లాడుతున్నాయని వైసీపీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య మండిపడ్డారు. మంగళవారం గుంటూరు జీజీహెచ్ వద్ద మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సంక్షేమ హాస్టల్లో మెరుగైన సదుపాయాలు అందిస్తున్నామని, కల్లబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకుండా గాలికి వదిలేసారని ఆరోపించారు.