VSP: వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జోరుగా సాగుతుందని విశాఖ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెం పోర్టు హాస్పటల్ జంక్షన్ ప్రాంతాల్లో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. సంతకాల సేకరణ మంగళవారం సాయంత్రం ముమ్మురంగా చేపట్టారు. కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా యువత భారీగా పాల్గొన్నారు.