VSP: గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంతో విశాఖ మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని, భవిష్యత్తులో విశాఖ రూపురేఖలు మారిపోతాయని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సందర్భంగా మంగళవారం రాత్రి సత్యం కూడలి వద్ద ఆయన ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు.