E.G: రాష్ట్రంలో విచ్చలవిడిగా తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలని మాజీ హోంమంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. సోమవారం దేవరపల్లి ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. విచ్చలవిడిగా జరుగుతున్న నకిలీ మద్యం విక్రయాలను, బెల్ట్ షాపుల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.