అనకాపల్లి: పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు పంపించారు. వాటిపై విచారణ నిర్వహించి సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.