SRD: రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్, కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు.