కోనసీమ: అమలాపురం లోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదు దారులతో నేరుగా మాట్లాడి, వారికి సత్వర న్యాయం చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. వాటిని చట్ట పరిధి లో విచారించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు.