KMM: చింతకాని మండలం నేరేడలో సోమవారం వైద్యాధికారి అల్తాఫ్ ఆధ్వర్యంలో పైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పైలేరియా వ్యాధి నిర్ధారణ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా ఈనెల 15, 16 తేదీల్లో పాతర్లపాడు, 17, 18 తేదీల్లో లచ్చగూడెంలో ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని వైద్యాధికారి పేర్కొన్నారు.