NLG: చిట్యాలకు చెందిన బోర్ వెల్ యజమాని ఒరిస్సా రాష్ట్రంలో ఏనుగుల దాడిలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. దసరాకు వచ్చిన రుద్రారపు సైదులు శనివారం బోరు పనుల కోసం ఒరిస్సా, దేన్ కనాల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు.