BDK: అశ్వాపురం మండలం మల్లెలమడుగు ఎస్సీ కాలనీలో సోమవారం గ్రామసభ జరిగింది. గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ కాలనీ రోడ్డు వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాములు వెంకటేశ్వర్లు, రాంబాబు, గోపయ్య, సంపత్, ఉపేందర్ పాల్గొన్నారు.