WGL: జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తన పై పార్టీ హైకమాండ్ క్లాస్ తీసుకుందనే వార్తలను ఖండించారు. “కావాలనే కొన్ని చానళ్లు నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. హైకమాండ్ నాకు క్లాస్ తీసుకోలేదు. నేను పార్టీ లైన్ దాటలేదు. రెండు రోజులుగా ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికీ వెళ్లలేదు. ఫేక్ న్యూస్ నమ్మవద్దు” అని స్పష్టం చేశారు.