TG: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. మెడిసిన్ కూడా ఉండటం లేదన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లే కూలుస్తున్నారని, పెద్ద ఇళ్లు కూల్చడం లేదని మండిపడ్డారు.