NLG: ఎస్సారెస్పీ రెండోదశ కాల్వకు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని MCPI(M) పార్టీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తో సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పోతుగంటి కాశి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల భరత్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.