MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలోని ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ కన్నాల మాజీ సర్పంచ్ మంద అనిత సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. పలువురు అక్రమార్కులు రాత్రి వేళ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.