VZM: రాష్ట్ర ఫౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ను సోమవారం విశాఖపట్టణంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల పర్యటనలో భాగంగా మంత్రిని కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలోని జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై వారి మధ్య చర్చ సాగినట్లు తెలిపారు.