W.G: రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం తణుకు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మద్యం కారణంగా పేద ప్రజల ప్రాణాలు పోతున్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అనంతరం ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.