ATP: ఏడేళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు నియమించబడినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి ఫలితమని పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 57 మంది ఉపాధ్యాయులు వచ్చారని, బాధ్యతగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు.