SKLM: జీఎస్టీ పన్ను తగ్గింపుతో అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మేలు జరుగుతుందని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జీఎస్టీ 2.0 అవగాహన సదస్సు అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు పై ప్రజలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఎస్టీ తగ్గించడంతో అన్ని వస్తువులపై ధరలు తగ్గాయన్నారు.