NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రచారంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని షేక్ పేట డివిజన్ పరిధిలోని పారామౌంట్ గేట్ నం.1లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరుపున ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు.