KNR: యూనిసెఫ్ సహకారంతో రానున్న రోజుల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాలో చేపట్టే వివిధ కార్యక్రమాలపై ఆ సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశమయ్యారు. ఈనెల 15న గల గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, స్వచ్ఛ హరిత విద్యాలయాల నమోదు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం వంటి విషయాలపై ప్రతినిధులతో చర్చించారు.