HNK: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీకి రైల్వే బోర్డు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రాల నుంచి స్లీపర్ కోచ్ల డిమాండ్ పెరగడంతో ఈనిర్ణయం తీసుకున్నారు. కాజీపేట ఫ్యాక్టరీని ఈ ప్రాజెక్టుకు కేటాయించనున్నారు. త్వరలో 200 స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో కాజీపేటకు ప్రతిష్ఠాత్మక గౌరవం లభించనుంది.