KMM: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మధిర మండల బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీహరి చౌదరి అన్నారు. రైతాంగ సమస్యలపై సోమవారం మధిర మండల తహసీల్దార్ రాంబాబుకు నాయకులు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. పత్తి, మొక్కజొన్న, మిరప, వరి, సుబాబుల్ వంటి తదితర పంటలు వర్షానికి నష్టపోయాయని పేర్కొన్నారు.