KRNL: ఆదోని పట్టణంలోని 18వ వార్డు ఆర్టీసీ కాలనీ-1 సచివాలయం తలుపులు సోమవారం ఉదయం అయినా తెరవకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. సేవలు పొందడానికి వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.