TPT: తిరుచానూరు మామిడి కాయలు మండి వద్ద మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మూడోసారి ప్రారంభమైన రైతుబజారు సైతం మూతపడింది. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు, గత బుధవారం మూడోసారి ఈ మార్కెట్‌ను అధికారులు ప్రారంభించారు. అయితే రైతులు ఎవరూ రాకపోవడంతో మూతవేసి ఉంది. మార్కెట్లో సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.