WGL: సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో అన్నదాతలు ఆగమాగంకు గురయ్యారు. ఈ క్రమంలో ఏనుమాముల మార్కెట్లో రైతులు అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న తడిసింది. ప్రస్తుతం క్వింటాలుకు 2400 రూపాయల మద్దతు ధర ఉండగా, వ్యాపారులు రూ. 1700 నుండి 1900కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నారు.